జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా.. వేలాది హిందువుల రోడ్‌షో
- ఢాకాలో హిందువుల భారీ నిరసనలు
- రాముణ్ని అవమానించారంటూ ఆగ్రహం
- 81 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణ పనులు నిలిపివేత
- బెదిరింపుల కారణంగా నిర్మాణం ఆపిన వైనం
- 72 గంటల గడువు విధించిన హిందూ సంఘాలు
ఒక ఫొటో చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారుతోంది. బంగ్లాదేశ్‌లో రాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ వర్గాలు చేసిన చర్యలు హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహం రేపాయి. రాముడి చిత్రాన్ని అవమానించారనే ఆరోపణలతో వేలాది మంది హిందువులు శుక్రవారం ఢాకా వీధుల్లోకి వచ్చారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు.
రాజధాని ఢాకాలోని షాబాగ్ ప్రాంతం శుక్రవారం నిరసనకారులతో కిక్కిరిసిపోయింది. హిందూ మహాజోట్ పిలుపుతో విద్యార్థులు, హిందూ సంఘాలు కలిసి భారీ ప్రదర్శన చేపట్టాయి. జాతీయ ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులు, కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు. రాముడి చిత్రాన్ని అవమానించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల ప్రారంభంలో గైబంధా జిల్లాలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో కొందరు మత ఛాందసవాదులు రాముడి చిత్రంపై చెప్పు ఉంచారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైనా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అంటున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 72 గంటల గడువు విధించాయి. అప్పటిలోగా చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి.
ఉత్తర బంగ్లాదేశ్‌లోని పలాష్‌బారిలో 81 అడుగుల ఎత్తుతో రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తైతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా నిలిచేది. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయ సముదాయంలో 50 అడుగుల కృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహం కూడా నిర్మించాలనే ప్రణాళిక ఉంది.
విగ్రహ నిర్మాణానికి వ్యతిరేకంగా కొన్ని ఇస్లామిక్ సంస్థలు బెదిరింపులకు దిగినట్లు ఆలయ కమిటీ చెబుతోంది. ఓ మత బోధకుడు బుల్డోజర్తో విగ్రహాన్ని కూల్చేస్తానని హెచ్చరించాడని ఆరోపించింది. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా పనులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. వివాదాలు వద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
విగ్రహ నిర్మాణానికి అడ్డంకులు తొలగించకపోతే, బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాల్లో ఒక్కో రామాలయం నిర్మిస్తామని హిందూ మహాజోట్ ప్రకటించింది. శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు పూజా ఉత్సవాల జాతీయ కమిటీ తెలిపింది. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు సుమారు 8 శాతం మంది ఉన్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 133 సామాజిక, మత ఘర్షణల ఘటనలు నమోదైనట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి.